ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టూల్స్ విషయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ టూల్స్ చెప్పే ప్రతీ విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ …AI మోడల్స్ “లోపాలకు గురయ్యే అవకాశం ఉంది” అని , ఇతర టూల్స్‌తో పాటు వాటిని ఉపయోగించాలని ప్రజలను కోరారు.
ఏఐ బుడగ పేలిపోతే ఏ కంపెనీ కూడా దాని నుండి తప్పించుకోదని పిచాయ్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఏఐ మోడల్స్‌లోనూ లోపాలు ఉంండే అవకాశం ఉందని, కాబట్టి యూజర్లు ఇతర టూల్స్ వినియోగిస్తూ కూడా సమతుల్యత పాటించాలని కోరారు.
ఆర్ఠిఫిషియలి ఇంటెలిజెంట్‌పై పూర్తిగా ఆధాపడకుండా, బలమైన సమాచార వ్యవస్థ కలిగి ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది మే నెలలో గూగుల్ తన జెమిని చాట్‌బాట్‌ని ఉపయోగించి గూగుల్ సెర్చ్‌లో “AI మోడ్”ని ప్రవేశపెట్టింది, దీని సహాయంతో యూజర్లకు నిపుణులతో మాట్లాడే అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గూగుల్ కన్సూమర్ AI మోడల్, జెమిని 3.0, త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.
“మీరు ఏదైనా క్రియేటివ్‌గా రాయాలనుకుంటే” AI టూల్స్ సహాయం తీసుకుంటున్నప్పటికీ ” అవి చెప్పే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు, ఏ విషయంలో నైపుణ్యం కలిగి ఉన్నాయే, వాటి కోసం ఆ టూల్స్ ఉపయోగించడం నేర్చుకోవాలి” అని పిచాయ్ అన్నారు.


నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్