telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపటి నుండే .. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ..

telangana assembly budget sessions from tomorrow

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. రేపు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టనున్నారు.

నేడు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొట్టమొదటగా తన్నీరు హరీశ్ రావు ప్రమాణ స్వీకారం చేసి, సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. తర్వాత కల్వకుంట్ల తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Related posts