ప్రపంచంలోనే అతి విలువైన వస్తువు బంగారం. దీనిని కొనడానికి ఎంతో ఇష్టపడతారు మహిళలు. అయితే.. తాజాగా బంగారం ధరలు మహిళలకు షాకిచ్చాయి. గత మూడు రోజులు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ మళ్లీ చుక్కలు చూపించాయి. ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి రూ. 48,920 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి రూ. 44,840 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 46,970 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 360 పెరిగి రూ. 43,050 పలుకుతోంది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ.800 పెరిగి 73,300గా నమోదైంది.

