టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా గౌతమ్ కు గ్రాడ్యుయేషన్ పూర్తయింది. కాన్వొకేషన్ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. తనయుడి ఘనత పట్ల మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.
నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. నువ్వు విజయవంతంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్.
తదుపరి అధ్యాయం నీ కోసం ఎదురుచూస్తోంది. అందులో కూడా నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతావని నాకు నమ్మకం ఉంది.
నీ కలల సాకారం కోసం నిత్యం కృషి చేస్తూ ఉండు. ఎప్పటికీ నిన్ను ప్రేమించే వాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో.
ఓ తండ్రిగా ఇవాళ నేను పుత్రోత్సాహంతో గర్విస్తున్నాను” అంటూ మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.
అంతేకాదు, తనయుడు గౌతమ్ కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరైనప్పటి ఫొటోలు కూడా పంచుకున్నారు.
పెళ్లిపై శృతి హాసన్ స్పందన