telugu navyamedia
ఆరోగ్యం

అందం నుండి ఆరోగ్యం దాకా.. మొలకలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎవరైనా ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలనే అనుకుంటారు. అయితే అలా అనుకుంటే సరిపోదు.

అందుకు చేయాల్సినవి, తినాల్సినవి కూడా తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు వ్యాయామం చెయ్యాలి.

శారీరక శ్రమ లేకుంటే ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదు. ఇక తినవలసిన వాటిలో కూడా ఆరోగ్యాన్నిచ్చేవే ఎంచుకోవాలి.

మొలకలలో పోషకాలు ఫుల్ :-  ఆరోగ్యం కోసం మనం తినాల్సిన వాటిలో ముఖ్యమైనవి మొలకలు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం గానో, లేక సాయంత్రం చిరుతిండి గానో మొలకలు తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.

మొలకలలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మన శరీరానికి అవసరమైన వివిధ రకాల విటమిన్లతో పాటు, పొటాషియం, మెగ్నీషియం, రాగి, ఐరన్ వంటి మినరల్స్ కూడా మొలకల్లో సమృద్ధిగా ఉంటాయి.

మొలకలతో ఆరోగ్య ప్రయోజనాలు :-  మొలకలు తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు గణనీయంగా పెరుగుతాయి.

మొలకలు తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ సి లభిస్తుంది. జింకు, ఇనుము, క్యాల్షియం వంటి పోషకాలు కూడా అందుతాయి.

మొలకలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మొలకలు మెరుగుపరుస్తాయి.

బరువు తగ్గటంలో మొలకల పాత్ర :- అంతేకాదు శరీర బరువును తగ్గించడంలో కూడా మొలకలు సహాయం చేస్తాయి. మొలకలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

ఇవి రక్తప్రసరణను మెరుగు పరచడంతో పాటు, రక్త ప్రవాహంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తాయి.

మొలకల వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొలకలు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.

మొలకలతో ఒత్తిడి దూరం :-  మొలకలు తినడం వల్ల రక్తం సరఫరా సాఫీగా సాగడం మాత్రమే కాకుండా, శరీరం ఉత్తేజంగా కూడా ఉంటుంది.

మొలకలు జుట్టుకు, చర్మానికి కూడా ప్రయోజనాలను చేకూరుస్తాయి. మొలకలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. మొలకలు ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని మొలకలు గణనీయంగా పెంచుతాయి.

కనక ప్రతిరోజు మొలకలు తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడంతోపాటు, మన జీవన శైలిలో మార్పులు, మన శరీరంలో ఉత్తేజాన్ని కచ్చితంగా గమనించగలం

Related posts