telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రాజధానిని .. చుట్టుముట్టేసిన పొగ మంచు.. పలు విమానాల రద్దు..

fog issue in delhi many flights run late

దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయగా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టుమని 10 మీటర్లయినా విజిబిలిటీ లేకపోవడంతో పదుల సంఖ్యలో విమానాలు రన్ వే ఎక్కకుండా, అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న విమానాల ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వని అధికారులు, వాటిని ముంబై, అహ్మదాబాద్ లకు దారి మళ్లిస్తున్నారు.

ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్ వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయలుదేరుతాయని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. పొగమంచు కారణంగా 4 విమానాలను దారి మళ్లించామని, పరిస్థితి మెరుగుపడిన తరువాత అవి తిరిగి న్యూఢిల్లీ చేరుతాయని అధికారులు వ్యాఖ్యానించారు.

Related posts