telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం లోని ‘ఈ మాయ పేరేమిటో’ సాంగ్

oreybujjiga

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు.కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఈ మాయ పేరేమిటో’ పాటను తాజాగా విడుదల చేశారు. ఉగాది కానుకగా మార్చి 25న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. తాజాగా ‘ఈ మాయ పేరేమిటో’సాంగ్ రిలీజ్ చేసారు. అనూప్ రూబెన్స్ – సిద్ శ్రీరామ్ కాంబోలో వచ్చిన మరో మంచి సాంగ్ ఇది. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రలు పోషించారు.

Related posts