తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు గతేడాది కంటే ఈ ఏడాది దరఖాస్తులు పెరిగాయి. గత ఏడాది మొత్తం 2.16 లక్షల మంది ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య పెరిగినట్టు వెల్లడించారు. ఈ నెల 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు జారీ చేయనున్నారు.
జులై 6 నుంచి 9వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. జులై 1న పాలీసెట్, ఈసెట్‌కు నేటి నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తారు. ఐదుగురు ట్రాన్స్జెండర్లు లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. జులై 3 వరకు ఎంసెట్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జులై 1న 250 కేంద్రాల్లో పాలీసెట్, 4న ఈసెట్, జులై 2 నుంచి లాసెట్ హాల్ టికెట్లు, 5 నుంచి ఎడ్‌సెట్ హాల్ టికెట్ల జారీ చేస్తారు.