telugu navyamedia
సినిమా వార్తలు

జూలై 12న రానున్న “దొరసాని”

Dorasani

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “దొరసాని”. ఈ చిత్రంతో కేవీఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సన్ని కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఎంతో రియ‌లిస్టిక్‌గా తెర‌కెక్కుతున్న “దొరసాని” చిత్రం తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80వ దశకంలో జరిగిన కథగా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయబోతున్నట్టుగా చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, “నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే” పాట అంచనాలను పెంచాయి. మరోపాట “కలవరమై.. కలవరమై” ఈనెల 24న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం.

Related posts