అడవుల్లో రాజుకున్న మంటలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సమస్య కేవలం అమెరికాలో మాత్రమే ఉన్నదని తెలిపారు. ఇది వేరే దేశాలకు లేని సమస్యని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో అడవుల్లో రాజుకున్న మంటలు అనేక రాష్ట్రాలకు విస్తరించి, 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రంప్, తన ప్రచారంలో ఈ కార్చిచ్చు గురించి ప్రస్తావించనే లేదని విపక్షాలు నిలదీసిన నేపథ్యంలో ఆయన ఫైర్ ఫైటర్స్ తో సమావేశమై పరిస్థితిపై చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని దేశాల్లో మంటలు అంటుకునే చెట్లు ఉన్నాయని కానీ, అమెరికాలో ఉన్న సమస్య, వేరే దేశాల్లో లేదని అన్నారు. త్వరలోనే ఈ మంటలు చల్లారుతాయని వెల్లడించారు.
ఈ కార్చిచ్చు వాతావరణ మార్పులతో వచ్చిన సమస్య కాదని తెలిపారు. మేనేజ్ మెంట్ కు సంబంధించిన విషయమనిపేర్కొన్నారు. అడవుల్లో మంటలకు సైన్స్ కు సంబంధం ఉందని తాను భావించడం లేదని ట్రంప్ వెల్లడించారు.
చంద్రబాబుపై కోపంతో జగన్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో: సోమిరెడ్డి