telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు అర్బన్‌ మాంక్‌ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదే…!

Chiru

ఇటీవలే ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గుండుతో దర్శనమిచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. చిరు తన 152వ సినిమా ‘ఆచార్య’ కోసం అర్బన్‌ మాంక్‌ లుక్‌లో కనపడబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా చిరంజీవి తన లుక్‌ వెనకున్న సీక్రెట్‌ను రివీల్‌ చేశారు. మెగాస్టార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు అర్బన్‌ మాంక్‌ లుక్‌లోకి తాను ఎలా మారాననే విషయాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. “నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్‌” అని చిరు వీడియోతో పాటు మెసేజ్‌ కూడా షేర్‌ చేశారు. తన అర్బన్ మాంక్ లుక్ వెనకున్న సీక్రెట్ ప్రాస్థటిక్ మేకప్ అని మొత్తానికి బయటపెట్టేశారు చిరు.

 

View this post on Instagram

 

Thanks to all the technicians of the industry, who can make any look believable. Salute the magic of cinema!

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

Related posts