telugu navyamedia
ఆరోగ్యం వార్తలు

బ్రౌన్ రైస్ తినడం బరువు తగ్గుదలకు సహాయపడుతుందా? సాధారణ బియ్యంతో పోలిస్తే దీని ప్రత్యేకతలు ఏమిటి?

వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌ను చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. బ్రౌన్ రైస్‌ను ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం అని కూడా అంటారు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.

వైట్ రైస్ కాకుండా, బ్రౌన్ రైస్ తక్కువ ప్రాసెసింగ్‌కు లోనవుతుంది మరియు అధిక ఫైబర్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ను చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, సాధారణంగా బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తారు, దీని వల్ల పోషకాలు తగ్గిపోతాయి. బ్రౌన్ రైస్ అలా కాదు. దీనిలో కేవలం బయటి పొట్టు మాత్రమే తొలగిస్తారు.

గోధుమ లేదా లేత గోధుమ రంగులో ఉండే ఈ బియ్యం చాలా పోషకాలను కలిగి ఉంటుంది. తెల్ల బియ్యం పొట్టు మరియు ఊక పొరతో పాటు బాగా పాలిష్ చేయబడుతుంది, అందువల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి.

అందుకే, సాధారణ బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి, బ్రౌన్ రైస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.

ఒక కప్పు బ్రౌన్ రైస్‌లోని పోషకాలు ఇలా ఉంటాయి..
కేలరీలు – 248
ఫైబర్ – 3.2 గ్రా
కొవ్వు – 2 గ్రా
కార్బోహైడ్రేట్లు – 52 గ్రా
ప్రోటీన్ – 5.5 గ్రా
ఐరన్ – డివి 6 శాతం
మెగ్నీషియం- 19 శాతం
భాస్వరం – 17 శాతం
జింక్ – 13 శాతం
మాంగనీస్ – 86శాతం
సెలీనియం- శాతం
థయామిన్ (B1)-30 శాతం
నియాసిన్ (B3)-32 శాతం
పిరిడాక్సిన్ (B6) – 15 శాతం
పాంతోతేనిక్ యాసిడ్ (B) – 15 శాతం మేర పోషకాలు ఉంటాయి..
బరువు తగ్గడానికి ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది.

Related posts