దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దిశపై లైంగిక దాడి..హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారు. అయితే. ఈ ఘటనని ఆధారంగా చేసుకుని వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ “దిశ ఎన్కౌంటర్ ” అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను విడుదల చేశారు రాం గోపాల్ వర్మ. అయితే ఇప్పటికే ఈ సినిమా ఆపాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ సినిమాను ఆపాలంటూ దిశ తండ్రి కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. దిశ కథతో రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమా పై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాము.. అసభ్యకరంగా సినిమాను తీశారు. యూట్యూబ్ లో విడుదల చేసిన ట్రైలర్ ను తొలగించడంతో పాటు సినిమా విడుదల ఆపాలంటూ పిటీషన్ వేశాము..హైకోర్టు సింగిల్ బెంచ్, సెన్సార్ బోర్డుకు సీనిమా పై పలు సూచనలు చేసింది. దీంతో హైకోర్టు డివిజనల్ బెంచ్ లో మరోసారి పిటీషన్ దాఖలు చేశాము. సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపి వేయాలి..సినిమా విడుదల ను అడ్డుకోవడానికి సుప్రింకోర్టు వరకు వెళ్తాం..ఒకవేళ సినిమాను రిలీజ్ చేస్తే ఆర్జీవి పై పరువు నష్టం దావా వేస్తా…నిందితుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళన పై నేను స్పందించను” అని అన్నారు.
previous post