telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” కోసం భారీ సెట్

RRR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వలో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రంలో కీల‌క పాత్రలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, చ‌ర‌ణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి RRR (రౌద్రం రుధిరం ర‌ణం) అనే టైటిల్‌ని కన్ఫామ్ చేస్తూ ఉగాది కానుకగా మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. క‌రోనా ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా వెన‌క్కి వెళ్లేలా ఉంది. లాక్‌డౌన్ వ‌ల్ల ఆగిపోయిన సినిమాల షూటింగ్స్‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్నారు. అందులో ముందుగా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమానే సెట్స్‌పైకి వెళ్లేలా ఉంది. ఈ షెడ్యూల్ కోసం గండిపేట‌లో జ‌క్క‌న్న అండ్ టీమ్ భారీ సెట్ వేయ‌బోతున్నార‌ట‌. ఈ సెట్ విలువ రూ.18 కోట్లు ఉండ‌వ‌చ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts