కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక మందు బాబుల పరిస్థితి మాత్రం వర్ణనాతీతం.. మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ అఖిల భారత తాగుబోతుల తరపున తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. “మందు దొరక్క తాగుబోతు సోదరులు జుట్టు పీక్కుంటున్నారు. పసి పిల్లల్లా గుక్కపెట్టి ఏడుస్తున్నారు. పిచ్చాసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఫస్ట్రేషన్లో పెళ్లాలను చితకబాదుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలా పెద్దమనసు చేసుకుని ఆలోచించండి’.. అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌లకు విన్నవిస్తూ వారితో పాటుగా కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
Humble request to #KCR @KTRTRS and @ysjagan from me, those who are bored, pulling their hair,crying like babies,joining mental hospitals and wives getting beaten by husbands in frustration ..Have a large heart like Mamata Banerjee and give us CHEERS! https://t.co/EHxbngJcpg
— Ram Gopal Varma (@RGVzoomin) April 10, 2020