telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ రియల్ హీరో… ముందే ఊహించిన పూరీ…!?

Puri

బాలీవుడ్ నటుడు సోనూసూద్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలిచాడు. అయితే తాజాగా సోనూ సూద్ రియల్ హీరో అని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముందే కనిపెట్టారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఏక్ నిరంజన్` సినిమాలో సోనూసూద్ విలన్‌గా నటించాడు. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో `నేను హీరో` అంటూ సోనూ డైలాగ్ చెబుతాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్.. `సోనూసూద్ జనాలతో ఎప్పటికైనా హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టుంది పూరీ జగన్ అన్నయ్య. సోనూసూద్ భాయ్.. మీరు రియల్ హీరో` అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి స్పందించిన పూరి.. `సోనూ ఎప్పుడూ హీరోనే అని నాకు తెలుసు` అని రిప్లై ఇచ్చారు.

Related posts