telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఇంటి నుంచి రియా ఇంటికి కొరియర్… అందులో ఏముందంటే ?

Rhea

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైల్లో ఉన్నారు. తాజాగా ఆమె మరోమారు రియా కోర్టులో బెయిల్ పిటిష‌న్ వేసింది. అది కూడా తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉండ‌డంతో ఆమెకు క‌ఠిన శిక్ష ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. కాగా ఈ కేసులో రియా సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు మ‌రికొందరి బెయిల్ పిటిష‌న్లు కూడా తిరస్క‌ర‌ణ‌కు గురి కావ‌డం గ‌మ‌నార్హం. మరోవైపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో మరో 15 మంది సెలబ్రిటీల పేర్లను రియా వెల్లడించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరందరినీ విచారించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతోంది. అయితే ఈ 15 మంది బాలీవుడ్ లో బీ-కేటగిరీకి చెందిన యాక్టర్లని తెలుస్తోంది. తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ సమయంలో సుశాంత్ ఇంటి నుంచి రియా నివాసానికి ఒక కొరియర్ వెళ్లిందనేది ఆ సమాచారం. రియా సోదరుడు ఆ కొరియర్ ను రిసీవ్ చేసుకున్నాడు. ఆ కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ అనే డౌట్ రాకుండా అరకిలో బరువున్న ఇతర వస్తువులను అందులో ప్యాక్ చేశారు. పోలీసుల సోదాల్లో చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్ ను కొరియర్ ద్వారా పంపించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రియాకు కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Related posts