telugu navyamedia
క్రీడలు వార్తలు

రషీద్ ఖాన్‌ ఇల్లు చూసి ఆశ్చర్య పోతున్న క్రికెటర్స్…

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 అర్దాంతరంగా వాయిదా పడటంతో ఇంటికి వెళ్లిన ఈ సన్‌రైజర్స్ హైదారాబాద్ స్పిన్నర్.. ఈ విపత్కర కాలంలో అందరూ ఇంట్లోనే భద్రంగా ఉండాలని, మాస్క్ తప్పని సరి వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఇంట్లో దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోలోని రషీద్ ఖాన్ ఇంటిని చూసి అంతా అవాక్కయ్యారు. ఓ పెద్ద ప్యాలెస్‌లా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్ అయితే వాటే ప్యాలెస్ అంటూ నోరెళ్ల బెట్టింది. రషీద్ సహచర సన్‌రైజర్స్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్ కూడా కామెంట్ చేయగా.. భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఇంటికి సంబంధించిన మరిన్ని ఫొటోలను షేర్ చేయాలని కోరాడు. దాంతో ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. రాజుల కాలం నాటి ప్యాలెస్‌ను తలపిస్తున్న ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంది. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. రషీద్ ఖాన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు.

Related posts