telugu navyamedia
రాశి ఫలాలు

దిన ఫలితాలు : మే 27 సోమవారం రాశిఫ‌లాలు.

మేషరాశి..

చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు.

వృషభరాశి..

బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రు సంభందమైన సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.

మిథునరాశి..

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

కర్కాటకరాశి..

మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు, మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

సింహరాశి..

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి..

కన్య రాశి..

కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి.

తులరాశి..

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు.

వృశ్చికరాశి..

నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్ధిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తివ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ధనుస్సురాశి..

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.

మకరరాశి..

దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు.

కుంభరాశి..

చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.

మీనరాశి..

నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

Related posts