కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది.వైరస్ బారినపడి మనస్తాపంతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో బాధపడుతున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఫణిరాజ్(42), శిరీష (40) భార్యాభర్తలకు ఇటీవల కరోనా సోకింది.
వారం రోజుల క్రితం ఫణిరాజ్ తల్లి కరోనాతో మృతి చెందింది. కాగా, ఫణిరాజ్, శిరీష మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఇవి మరింత ముదరడంతో నిన్న భవనం పైనుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వారం రోజుల వ్యవధిలో మరణించడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
మంత్రులంతా భజనపరులు..భట్టి తీవ్ర విమర్శలు!