అమెరికాలోని వాషింగ్టన్లో ఉండే జీన్ కాంప్బెల్(60) అనే వృద్ధుడు కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐసోలేషన్ వార్డులో ఒంటరిగా ఉంటున్న కాంప్బెల్కు భార్యతో మాట్లాడాలనిపించింది. వైద్యులతో ఈ విషయం చెప్పాడు. కానీ, ఈ మహమ్మారి ఎక్కడ అతని నుంచి ఆమెకు సోకుతుందో అనే భయంతో వైద్యులు అందుకు నిరాకరించారు. అయితే వృద్ధుడి బాధ చూడలేక వైద్యులకు ఒక ఐడియా వచ్చింది. అందుకు ఏర్పాట్లు చేసిన వైద్యులు.. కాంప్బెల్ భార్యను ఆస్పత్రి బయటకు తీసుకొచ్చి గ్లాస్(అద్దం) కిటికీ ద్వారా అతనితో మాట్లాడించారు. ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించిన ఓ ప్రముఖ మీడియా సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో వైరల్గా మారింది. నెటిజన్ల హృదయాలను తాకింది.
previous post