తమ స్వార్థం కోసం కొత్త రాజధానుల జపం చేయడం మంచిదికాదని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి.హెచ్.హనుమంతరావు విమర్శించారు. ఈ రోజు ఆయన ఓ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికీ కొత్త మోజు ఎక్కువని దుయ్యబట్టారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆర్థిక భారమైన అన్ని రాజధానుల నిర్మాణానికి ఎందుకు పూనుకుంటున్నారని వి. హెచ్ ప్రశ్నించారు.
రాజధాని వికేంద్రీకరణ వల్ల నష్టమే తప్ప లాభం ఉందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో జగన్ ను కేంద్రమే నియంత్రించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రం రాజధాని విషయంలోనూ జగన్‌ను నియంత్రించాలని కోరారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం నిలిపివేయాలని, బ్యాంకు రుణాలు రాకుండా అడ్డుకోవాలని సూచించారు.

