నాగార్జునసాగర్ లో కేసీఆర్ రేపు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కేసీఆర్ పూర్తి కాన్సంట్రేషన్ తో ప్రచార సరళిని నడిపిస్తున్నాడు. నియోజకవర్గంలో ఎన్నికలు సమీపించిన తర్వాత రెండో బహిరంగ సభ రేపు సాయంత్రం హాలియా సమీపంలో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం అన్ని వైపులా కవర్ చేసే విధంగా ఈ సభ జరగనుంది. ఒకవైపు సభ జరగకుండా కాంగ్రెస్ బిజెపి అనేక ఎత్తుగడలు వేసినప్పటికీ అవి ఫలించలేదు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి లక్షలాది మందితో సభ నిర్వహించడం ప్రమాదకరమైన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది. అదే విధంగా శివకుమార్ అనే వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించడంతో ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అదే విధంగా యజమానులతో కూడా హైకోర్టులో పిటిషన్ వేయించేందుకు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను కూడా ఈ రోజు కోర్టు కొట్టివేసింది.

