రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నికలు నిర్వ హించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పంచా యతీరాజ్ శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బిసిలకు 34 శాతంతో కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
previous post
next post


చంద్రబాబుకు అభివృద్ధి గురించి ఏం తెలుసు: మంత్రి బొత్స