telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగనన్న పచ్చతోరణం.. ప్రారంభం

ఏపీ సీఎం జగన్‌ రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని , చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని జగన్‌ అన్నారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జగన్‌ పిలుపునిచ్చారు. అనంతరం అటవీఖాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు.

Related posts