telugu navyamedia
సినిమా వార్తలు

గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న చిరంజీవి దంప‌తులు

కృష్ణా జిల్లా డోకిపర్రులోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన గోదా దేవి కళ్యానం లో మెగ‌స్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ దంపతులు పాల్గొన్నారు.

చిరంజీవి దంపతులకు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి ఆహ్వానించారు. వేదపండితులు పూర్ణకుంభంతో చిరు దంపతులకు సాదర స్వాగతం పలికారు.

ఈ సంద‌ర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన కొత్త సంవత్సరపు క్యాలెండర్‌, డైరీలను చిరంజీవి ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదాదేవి కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని, తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts