telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దావోస్ పర్యటన, ఈ రోజు రాత్రి కి ఢిల్లీ చేరుకోనున్నారు

ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది.

ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ ను, ఏపీ బ్రాండ్ ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు.

దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ కు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.

అక్కడి నుంచి బయల్దేరి ఈ రోజు అర్ధరాత్రి తరువాత సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు.

మంత్రి లోకేశ్ మరో రోజు అదనంగా దావోస్ లో ఉండనున్నారు. ఈ రోజు మరికొంత మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్న లోకేశ్ రేపు తిరుగుప్రయాణం అవుతారు.

Related posts