telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్టీకి ప్రచారం చేసిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు కృతజ్ఞతలు

తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తార ని వ్యాఖ్యానించారు.

మంగళవారం రాత్రి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ప్రవాసాంధ్రులకు గౌరవార్థం ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు వీడియో కాల్లో మాట్లాడారు.

గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల గురించి పట్టించుకోకపోవడంతో వారి ద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమ లు ఆగిపోయాయన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల కోసం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ ప్రభత్వం రద్దు చేసిందని, ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

Related posts