ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది.
తన పర్యటన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయలతో సమావేశమయ్యారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం, వివిధ రంగాలలో పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులకు వినతులు అందించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి అంశానికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
సీఐఐ సదస్సులో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు.
ఢిల్లీ పర్యటనను ముగించుకున్న చంద్రబాబు నేరుగా కర్నూలుకు బయల్దేరారు. నేడు నంద్యాల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు.
నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆల్లూరుకు చేరుకుంటారు.
1 గంటకు మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేస్తారు. హంద్రీనీవా కాలువలో జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
అనంతరం మల్యాలలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు.