విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించేందుకు ఆయన మంగళవారం నుంచి దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటించనున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించి, పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రధానంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్నోవేషన్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.
ఈ మేరకు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఈ పర్యటనలు చేపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రితో పాటు ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే పలు కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొంటోంది.