ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాల పునర్విభజనపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
గత నెల 27న ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసారు. అప్పటి నుంచి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు.
ఈ గడువు నేటితో ముగియడంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
అందిన అన్ని అభ్యంతరాలను సమీక్షించిన అనంతరం డిసెంబర్ 31న పునర్విభజనపై తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కాగా, ఇటీవల ప్రకటించిన 3 కొత్త జిల్లాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 29కి చేరనుంది.


ఏడు నెలల్లోనే రూ.35 వేల కోట్ల అప్పులు: యనమల