ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో విపక్ష నేతల సమావేశం ఈ రోజు ఢిల్లీలో కాన్స్టూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన 19 మంది నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎన్డీయేతర పక్షాల నేతలంతా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశామన్నారు.
మొత్తం వీవీ ప్యాట్స్ ను లెక్కించేందుకు ఈసీకి సమస్యేంటి? అని ప్రశ్నించారు. ఎన్నికల పోలింగ్ పై ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత అని అన్నారు. తాము లేవనెత్తిన సమస్యల పై ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే ఈ సమస్య తీవ్రతరంగా మారుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

