నటి, దర్శకురాలు విజయ నిర్మల మరణించిన పది రోజులైన సందర్భంగా శనివారం ఉదయం హైదరాబాద్లోని సంధ్య కన్వెషనల్ సెంటర్లో దశదిన కార్యక్రమాన్ని ఆమె కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ, పరచూరి గోపాల కృష్ణ, రమా ప్రభ, కోవై సరళ, సుబ్బిరామిరెడ్డి, జయసుధ, గల్లా జయదేవ్, మరళీ మోహన్ తదితరులు హాజరయ్యారు. విజయ నిర్మల మహిళా సాధికారితకి నిదర్శనం. కృష్ణ గారిని వెనకుండి నడిపించింది విజయ నిర్మలనే. ఎంతో సమయస్పూర్తి, వాక్ చాతుర్యం ఉన్న నటి. సుల్తాన్ సినిమా షూటింగ్ సమయంలో ఆమె మాతో పలు ఛలోక్తులు వేస్తూ నవ్విస్తూ ఉండేవారని విజయ నిర్మలని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. కళావాహిని విజయ నిర్మల (73) జూన్ 27 తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే . గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు విజయ నిర్మలకి నివాళులు అర్పించారు.
previous post
next post


పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ చిత్ర పరిశ్రమ ..