మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మాటిమాటికీ వార్తలలో నిలుస్తూనే ఉంది. ఎప్పుడు ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టారో అప్పటి నుండే ఈ బ్రిడ్జ్ మీదకు జనం ఎగబడడం మొదలయింది. అటు పని ఉన్న వాళ్ళు వెళ్తే పర్లేదు. కానీ అదే పనిగా పెట్టుకుని మరీ కొందరు ఆ బ్రిడ్జ్ మీద హల్చల్ చేస్తూ కెమేరాకు చిక్కారు. ఈ జనం దెబ్బకు పోలీసులు ఏకంగా వీకెండ్స్ అసలు వాహనాలను అనుమతించడమే మానేశారు. ఎందుకొచ్చిన గోల అని ఆ రెండు రోజుల్లో కేవలం పర్యాటకులని సేల్ఫీ తీసుకోవడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. అప్పుడు కూడా ఎక్కడిక్కడ పోలీసులు కొందరు మొహరించి అదుపు చేస్తున్నారు.అలానే సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేసి కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు వారిని అలెర్ట్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా రోజూ ఏదో ఒక కారణంతో ఈ బ్రిడ్జ్ వార్తల్లోకి వస్తూనే ఉంది. తాజాగా ఈ బ్రిడ్జ్ మీద కారు ప్రమాదానికి గురయ్యింది. మాదాపూర్ నుండి బంజారాహిల్స్ వెళ్తున్న కారు అకస్మాత్తుగా టైర్ పేలడంతో పల్టీ కొట్టింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు.
previous post
next post
రాష్ట్రంలో రాక్షస పాలన.. వైసీపీ సర్కార్ పై గోరంట్ల ఫైర్