లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటల్ (కాంటీన్)లలో ఒకటైన, కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ను టీటీడీ రద్దు చేసింది.
ప్రస్తుతం హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు రూ.76,04,196.
ఇందుకు సంబంధించి జూన్ నెలలో సదరు హోటల్‌కు తుది నోటీసులు జారీ చేయడమైనది.
పలుమార్లు నోటీసులు జారీ చేసినా, లైసెన్సు ఫీజు చెల్లించనందుకు హోటల్ లైసెన్స్‌ను రద్దు చేసి, టీటీడీ రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం గురువారం హోటల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు: సాధినేని యామిని