రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్న భ్రమరాంబ దుర్గగుడికి కొత్త ఈవోగా ఇవ్వల బాధ్యతలు స్వీకరించారు. సింహాచలం, కాణిపాకం, అన్నవరం, శ్రీకాళహస్తి, విశాఖ కానక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం,తిరుపతి ఆర్జేసి ఇలా చాలా చోట్ల పని చేసి ఇప్పుడు రాజమహేంద్రవరం ఆర్జేసిగా పని చేస్తూ బదిలీపై ఇంద్రకీలాద్రి కి వచ్చారు.. దుర్గగుడి ఈవోగా సురేశ్‌బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే వున్నారు…ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమ్మవారి సన్నిధిలో కోట్ల విలువైన శానిటేషన్, సెక్యూరిటీ, ప్రొవిజన్స్ కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ల నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అందులో అమ్మవారి ఉత్సవ రథానికి ఉండే నాలుగు వెండి సింహాలు మూడు మాయమైన ఘటన సమయంలో ఈవో కి కాలం చెల్లిపోయింది అనుకున్నారు కానీ ఆయన సేవ్ అయ్యారు. అసలు వాస్తవానికి ఇక్కడ ఈవోగా ఆర్జేసీ స్థాయి ఉన్నవారినే నియమించాలి. కానీ తాత్కాలిక పదోన్నతిపై డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సురేశ్‌బాబును అర్హత లేకున్నా పదవిని అప్పచెప్పటం వల్లే ఇంద్రకీలాద్రి చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి అనే విమర్శ కూడా లేకపోలేదు..ఏది ఏమైనప్పటికి ఆఖరికి ఈఓ సురేష్ బాబు రాజమహేంద్రవరం ఆర్జేసి గా బదిలీ అయ్యారు.
previous post