బిగ్ బాస్ సీజన్ 5 షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడింది. వచ్చే నెలలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభం కానుందని ట్విట్టర్ వేదికగా స్టార్ మా ఛానెల్ ప్రకటించింది.
ఇది వరకు విదులైన ప్రోమోని ఆధారంగా చేసుకొని కొత్త టీజర్ తో పాటూ విడుదల తేదీని అఫీషియల్ గా స్టార్ మా ప్రకటించింది. ఇప్పటికే . నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసింది. ఈ షో సెప్టెంబర్ 5 న సాయంత్రం 6గం.లకు ప్రారంభం అవనుండగా… సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గం.లకు మరియు శని, ఆదివారాల్లో రాత్రి 9గం.లకు ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో ఎక్కువమంది లేడీస్ కంటెస్టెంట్లు ఉండనున్నారట. షో లో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 26 నుండి క్వారెంటిన్ లో ఉంచడానికి అన్ని సిద్ధం చేశారట. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్ళే కంటెస్టంట్లు కొంత మంది పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి సీజన్ లో సందడి చేయడానికి యాంకర్ రవి, లోబో, సినిమా హీరోయిన్ ఇషా చావ్లా, నవ్య స్వామి, యూట్యూబ్ నిఖిల్, డాన్సర్ ఆనీ మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు, జబర్దస్త్ వర్షిని, సీరియల్ ఆర్టిస్ట్ విజే సన్నీలు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క రఘు మాస్టర్, సురేఖావాణి, సిరి హనుమంత్, యూట్యూబ్ ఫేమ్ షన్ముఖ్ జశ్వంత్ రాబోతున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే జెమిని టీవీలో జూ. ఎన్టీఆర్ “ఎవరు మీలో కోటీశ్వరుడు” షో తో అభిమానులను అలరిస్తుండగా.. టిఆర్‌పి రేటింగ్ లో దూసుకుపోతున్న వీరికి అడ్డుకట్టవేయడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బిగ్‌బాస్ షో ప్రసారం చేయాలని ‘స్టార్ మా’ యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ సారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తున్నారు.