telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా వైరస్‌పై అమితాబ్ వీడియో

Amitab Bachchan Tweet on RGV

కరోనా వైరస్‌పై సినీ సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ.. కరోనాపై ఓ వీడియో పోస్టు చేశారు. కరోనా వైరస్ విషయంలో జనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై యానిమేషన్ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోకు స్వయంగా అమితాబ్‌ వాయిస్ ఇచ్చారు. కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని వరుసగా వివరించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాను మహమ్మరిగా ప్రకటించింది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. మనం ఈ వైరస్‌ను వ్యాప్తి చెందకుండా అరికట్టాలి. అందుకే అందరూ ఇవి తప్పనిసరిగా పాటించాలి. దగ్గులు, తుమ్ములు వచ్చినప్పుడు నోటికి అడ్డంగా చేతి రుమాలు పెట్టుకొండి. తరుచూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోండి. ఎవరికైనా జలుబు, జ్వరం ఉన్నట్లు గమనిస్తే వారికి దూరంగా ఉండండి అలాంటివారితో మీట్ అవ్వకండి. ఒక వేళ మీకు జలుబు, జ్వరం లాంటివి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. మీకు గనుక జలుబు, తుమ్మలు వస్తుంటే ఇంట్లోనే ఉండండి. పార్టీలకు రద్దీ ప్రాంతాలకు వెళ్లకండి. సురక్షితంగా ఉండండి అంటూ అమితాబ్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.

Related posts