telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ కి క్లారిటీ ఎప్పుడు…‘రామ రావణ రాజ్యం’…?

rrr

‘బాహుబలి’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి దర్శకధీరుడు రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్, చెర్రీలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఇప్పటి వరకూ 80 శాతం పూర్తైందని సమాచారం. అయినా ఇప్పటికీ దీని టైటిల్ ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’కు మంచి టైటిల్‌ను ప్రేక్షకులు సూచించాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిల్లో కొన్ని టైటిల్స్‌కు మంచి స్పందన వచ్చింది. అవి ‘రామ రావణ రాజ్యం’, ‘రఘుపతి రాఘవ రాజారామ్’. ఈ రెండింటిలో.. ‘రామ రావణ రాజ్యం’ టైటిల్‌కి అధిక స్పందన వచ్చిందట. ఇక హిందీలో ఈ సినిమాకు ‘రామ్ రావణ్ రాజ్’ అన్న పేరు పెట్టాలని డైరెక్టర్ రాజమౌళి అనుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

Related posts