*పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ…
*ఆనాడు కర్నూలు రాజధానిగా ఉండేది..
*ఆనాటి స్వార్ధ రాజకీయాలతో ఈ పరిస్థతి వచ్చింది..
ఏపీ అసెంబ్లీలో పరిపాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చను వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి వినూత్న ఆలోచనలతో పరిపాలనా వికేంద్రీకరణ తీసుకువచ్చారన్నారు.
కర్నూలు శాసనసభలో ఒక ఇండిపెండెంట్ శాసననభ్యులు ఏనాడో కోరుకున్నారని తెలిపారు. మద్రాసు సభలో రాయలసీమలో తిరుపతి రాజధాని కావాలని కోరారన్నారు
హైదరాబాద్ శాసనసభలో అమరావతి రాజధాని కావాలని కోరుకున్నారని… ఇది జగన్మోహన రెడ్డి కోరిక కాదు గతంలో తెలుగు ప్రజల కోరిక అని గుర్తు చేశారు. జగన్ ఓ ప్రాంతం పట్ల, ఓ సామాజిక వర్గం పట్ల ఏదో కోపం ఉందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌దే అని భూమన తెలిపారు.ప్రజల వద్దకు పాలనను చేరువ చేయడం దేశంలోనే మొదటి సారి జగనే చేశారని అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత దగ్గరైంది. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకే సచివాలయ వ్యవస్థ. రాష్ర్టంలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశాము. అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.


మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు: అనురాధ