నటర్నత నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం `రూలర్`. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తయింది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య చాలా కష్టపడి బరువు తగ్గారు. ఇప్పటికే బయటకు వచ్చిన బాలయ్య ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా… నందమూరి బాలకృష్ణ ఐదుపదుల వయస్సులోను చాలా యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలలోనే కాదు పలు వేడుకలలోను ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తాను నటిస్తున్న రూలర్ సినిమా కోసం స్లిమ్ అయిన బాలయ్య డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే ఆయన తాజాగా ఓ ప్రైవేట్ వేడుకలో తమిళ చిత్రం వేదాళంలోని అలుమా డోలుమా అనే మాస్ సాంగ్‌కి స్టెప్స్ వేశారు. బాలయ్య స్టెప్పులకి అక్కడున్నవారంతా ఈలలు వేస్తూ గోల చేశారు. ప్రస్తుతం బాలయ్య డ్యాన్స్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమాల విషయానికి వస్తే కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న రూలర్ అభిమానులకి మంచి వినోదం అందించడం ఖాయంగా కనిపిస్తుంది. త్వరలో బోయపాటితో చేయనున్న ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నారు బాలకృష్ణ.
Balayya 😍😍🔥🔥#RuleronDEC20 #Ruler ♥️♥️ pic.twitter.com/yX55GaAz0Q
— #RulerOnDec20 😍 (@Balayya_Garu) 28 November 2019

