యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి” సినిమా ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగింది. ఈ చిత్రం విడుదలై ఐదేళ్లు పూర్తవుతున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తూర్పు ఆసియా దేశం మంగోలియాలో “బాహుబలి ది బిగినింగ్” చిత్రం డబ్ అయ్యి అక్కడ టెలికాస్ట్ కానున్నట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. అక్కడి ఛానెల్ టీవీ5 మంగోలియా ఛానెల్లో ఈ ఆగష్టు 16న ఈ చిత్రం టెలికాస్ట్ కానుందట. కాగా ఇటీవలే రష్యాలో టెలీకాస్ట్ కాబడిన మొదటి తెలుగు చిత్రంగా మన తెలుగు ఇండస్ట్రీకి అరుదైన గౌరవం తెచ్చిన చిత్రంగా, మొదటి తెలుగు హీరోగా ప్రభాస్ మరో మెట్టు పైకెక్కకగా ఇప్పుడు మరోమారు ప్రభాస్ పేరు ఖండాంతరాల్లో మారుమ్రోగనుంది.
previous post

