telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రకటించింది.

ఈ మేరకు ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి 2007 నుంచి 2011 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలు అందించారు.

గోవాకి మొదటి లోకాయుక్తగా పనిచేశారు. జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి స్వస్థల రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన సుదర్శన్‌రెడ్డి.. పలు కీలక బాధ్యతలను చేపట్టారు.

NDA అభ్యర్తిగా CP రాధాకృష్ణన్‌ బరిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండి కూటమి నుంచి సుదర్శన్‌రెడ్డి పేరు ఫైనల్ అయ్యింది.

అనూహ్యంగా తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి రేసులో నిలిపింది ఇండి కూటమి ఉస్మానియాలో విద్యనభ్యసించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (రిటైర్డ్) జూలై 8, 1946న ప్రస్తుత తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జన్మించారు.

సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు.

ఆయన 1971లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ – సివిల్ కేసులను నిర్వహించారు.

న్యాయమూర్తి కావడానికి ముందు, ఆయన కొంతకాలం కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారు, స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు.

ఆయన 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు.. అనంతరం 2011లో పదవీ విరమణ చేశారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఏకగ్రీవం చేయాలని ఓ పక్క మోదీ పిలుపు ఇచ్చారు. విపక్షాలతో చర్చల బాధ్యతను రాజ్‌నాథ్‌కు అప్పగించారు.

Related posts