అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఎదుట 644 మంది మిలిటెంట్లు లొంగిపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన వారు తమ వద్ద ఉన్న ఏకే-47, ఏకే-56 ఆయుధాలతో పాటు బాంబులు, పేలుడు పదార్థాలను కూడా పోలీసులకు అందించారని తెలిపారు.
త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతమంది మిలిటెంట్లు లొంగిపోవడం సాధారణ విషయం కాదని చెప్పారు. లొంగిపోయిన వారు 8 మిలిటెంట్ గ్రూపులకు చెందినవారని మహంత తెలిపారు. వీరంతా తమ ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. లొంగిపోయినవారికి స్వావలంబన పథకం కింద పునరావాసం కల్పిస్తామని చెప్పారు.
అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు.. జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు