ఏపీ రాజధాని పై సీఎం జగన్ డిసెంబర్ లో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణం విషయమై జగన్ నియమించిన జీఎస్ రావు కమిటి తన నివేదికను ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. నివేదికలోని ముఖ్యాంశాలు ఎలాగున్నా తమ పర్యటన వివరాలు, తమ అభిప్రాయాలను ఎలాగూ కమిటి జగన్ కు వివరిస్తుంది. దాని ఆధారంగా డిసెంబర్ లో జగన్ ఓ ప్రకటన చేయచ్చని సమాచారం. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారమైతే చంద్రబాబునాయుడు నిర్మించిన వెలగపూడిలోని తాత్కాలిక నిర్మాణాల ప్రాంతంలో అయితే శాస్వత నిర్మాణాలు ఉండదని అర్ధమవుతోంది. జగన్ చేయబోయే శాస్వత నిర్మాణాలు మంగళగిరికి సమీపంలో ఉంటుందట. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు అక్కడే ఉంటాయట. అలాగే రాజ్ భవన్ నిర్మాణం కూడా అక్కడే జరిగే అవకాశం ఉంటుందని తెలిసింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటి పరిసర ప్రాంతాల్లో కూడా శాస్వత నిర్మాణాలు చేయలనే అభిప్రాయాలు కూడా జనాల్లో నుండి ఎక్కువగా వచ్చాయట. అందుకనే రాజ్ భవన్ ఈ ప్రాంతంలో ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక హై కోర్టు సంగతే తేలాల్సుంది. హై కోర్టును కర్నూలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని భవనాలు అక్కడున్నాయి. కాకపోతే వాటికి కాస్త షోకులు చేస్తే సరిపోతుంది. మొత్తానికి జగన్ ఆలోచనల ప్రకారం అధికార వికేంద్రీకరణ జరగబోతోందని సమాచారం. అభివృద్ధి అన్నీ ప్రాంతాలకు విస్తరించాలని జగన్ నిర్ణయించారు. కాబట్టి ఇదే విషయాన్ని డిసెంబర్లో ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.