ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 26న ఉపఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఉపఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. నేటి నుంచి ఆగస్టు 14 తేదీ వరకు నామినేషన్లకు స్వీకరణకు ఈసీ తుది గడువు విధించింది.16 తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 19 వరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 26 తేదీన ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.
ఇప్పటివరకూ ఎమ్మెల్సీలుగా ఉన్న కరణం బలరాం(టీడీపీ), ఎ.కలికృష్ణ శ్రీనివాస్(ఆళ్లనాని-వైసీపీ), కె.వీరభద్ర స్వామి(వైసీపీ)లు తమ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయని వెల్లడించింది. ఈ ముగ్గురు నేతలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారని పేర్కొంది.