telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ రైతులకు జగన్ శుభవార్త…

pension to farmers in kerala

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ రైతులకు ఇవాళ వైఎస్సార్‌ రైతు భరోసా డబ్బు.. వారి బ్యాంక్‌ అకౌంట్లలో వేయనుంది ప్రభుత్వం. వీటితో పాటు కేంద్రం అందించే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి సొమ్ము కూడా జమ కానుంది. కౌలు రైతులతో పాటు ROFR పొంది సాగుచేస్తున్న రైతుకు కూడా నగదు ఇవ్వనున్నారు. మూడు విడతల్లో మొత్తం 13 వేల 5 వందల లెక్కన పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్‌. ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 వందల లెక్కన సాయం అందించింది. మూడో విడతలో 2 వేలు జమ జేయనుంది సర్కార్‌.  దాదాపు 51 లక్షల రైతు ఖాతాల్లో రూ.1120 కోట్లు జమ చేయనున్నారు. మరో విశేషం ఏంటంటే తొలిసారి ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ ఖరీఫ్‌లోనే చెల్లించనున్నారు. దీంతో పాటు నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు కూడా వెంటనే సాయం అందిస్తున్నారు. మొత్తం 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్టు అంచనా కట్టారు. ఎనిమిదిన్నర లక్షల మంది రైతులకు దాదాపు 646 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నారు. ఈ లెక్కన రైతుల ఖాతాల్లో మొత్తం 17వందల 66 కోట్ల రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts