ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని పరిధిలోని తాడేపల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో చంద్రబాబు నేడు ఓటేశారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు గుంటూరు-కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.
previous post
next post


48 పేజీలలో 31 కేసులు.. జగన్ నేరచరిత్రకు రుజువు: చంద్రబాబు