అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న 2014 బ్యాచ్ కు చెందిన లక్ష్మీనారాయణ..ఒక చీటింగ్ కేసు కు సంబంధించిన కేసులో నిందితుడు వద్దనే రూపాయలు యాభై వేలు లంచం డిమాండ్ చేసాడు. వారిద్దరి మధ్య 30 వేలకు ఒప్పందం జరిగింది. డబ్బులను బుధవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు..లక్ష్మీనారాయణ వద్ద కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేష్ కు 30 వేల రూపాయల నగదు ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది. ఆ డబ్బులను ఎస్సై లక్ష్మీనారాయణకు చేర వేస్తుండగా ఏసీబీ అధికారులు ఎస్సై తో పాటు కానిస్టేబుల్ నరేష్ ను పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని విచారించిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు ఎసిబి డిఎస్పీ సత్యనారాయణ.ఇలాంటి ఘటనల్లో తమకు ఎవరైనా ఒకటేనని పేర్కొన్నారు.
previous post


అమరావతి రాజధానిని జగన్ అప్పట్లో ఆమోదించారు: సీపీఐ నారాయణ