telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

అంతర్వేది ఆలయంలో స్వామి రథం దగ్ధం

fire accideent antaarvedi

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీ రథం గత రాత్రి అగ్నికి ఆహుతైంది. షెడ్డులో ఉన్న రథానికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలిబూడిదైంది. 40 అడుగుల ఎత్తున్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం పూర్తి టేకు కలపతో తయారు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రథానికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? లేక, ఎవరైనా ఆకతాయిలు కావాలనే నిప్పు పెట్టి ఉంటారా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఇక్కడ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

Related posts